ఓమిక్రాన్ పై కీలకభేటీ… రాష్ట్రాలతో సమావేశం కానున్న కేంద్రం…

-

ప్రపంచ దేశాాలను ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ ఓరియంట్ కరోనా కేసులు అనతి కాలంలోనే ప్రపంచంలోని 17 దేశాలకు పాకింది. పలు దేశాలు ఓమిక్రాన్ ప్రభావిత దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. తాజాగా ఇండియా కూడా రక్షణ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. ఓమిక్రాన్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం, రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఎయిర్ పోర్టుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కరోనా పరీక్షల గురించి గైడ్ లైన్స్ విడుదల చేసింది.

తాజాగా ఓమిక్రాన్ పై కేంద్రం, రాష్ట్రాలతో భేటీ కానుంది. కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం10.30 గంటలకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేయాలని సూచించనున్నారు. ఇప్పటికీ పలు రాష్ట్రాలు మొదటి డోసును 90 శాతం కూడా చేరుకోలేదు. వీటితో పాటు మళ్లీ కరోనా నిబంధనలపై ద్రుష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించే అవకాశం ఉంది. ఓమిక్రాన్ పై .. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు, క్వారంటైన్తో పాటు పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను వెంటనే జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news