హేమంత్​ సోరెన్​కు ఎదురు దెబ్బ..సీఎం పదవికి రాజీనామా ?

-

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి వర్యులు హేమంత్​ సోరెన్​కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆయన సీఎం పదవికే గండం ఏర్పడింది. హేమంత్​ సోరెన్​ పై అనర్హత వేటుకు ఈసీ సిఫారసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. దీంతో.. జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలనుంది.

ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్ని కల సంఘం సిఫార్సు చేసిందని సమాచారం అందుతోంది. ఈ మేరకు గవర్నర్​ రమేశ్​ బైస్​కు ఈమేరకు నివేదిక సమర్పించింది.

అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్.. మైనింగ్​ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూబీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయం కోరారు గవర్నర్… ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్​ చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news