Breaking : మరోసారి గూగుల్‌కు సీసీఐ జరిమానా..

-

అనైతిక వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో టెక్ దిగ్గజం గూగుల్‌కు భారత్‌ భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందన్న కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా.. ఇందుకు ప్రతిగా రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మరోసారి ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారత్ లో జరిమానా విధించారు. ఇటీవలే గూగుల్ పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.1,338 కోట్ల భారీ జరిమానా వడ్డించింది.

Drowning in trash: Google opens applications for circular-economy  accelerator | TechCrunch

ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందన్న కారణంతో ఈ జరిమానా విధించింది సీసీఐ. ఈ జరిమానా విధించి వారం గడవక ముందే గూగుల్ పై సీసీఐ మరోసారి కొరడా ఝుళిపించింది సీసీఐ. ఈసారి రూ.936.44 కోట్ల జరిమానా విధించింది సీసీఐ. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపించింది. నిర్దేశిత గడువులోపల గూగుల్ తన వైఖరి మార్చుకోవాలనీ ఆదేశించింది సీసీఐ.

Read more RELATED
Recommended to you

Latest news