తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. గద్దెల దగ్గర భక్తులు పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. సారలమ్మకు గిరిజనులు సాక పోశారు. గిరిజన సంప్రదాయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపై బయల్దేరారు. ఎల్లుండి గద్దెలపై అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. కాగా జాతర జరిగే నాలుగురోజుల్లో 2 కోట్ల మంది వస్తారని అంచనా.సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం (బెల్లం) మొక్కులు తీర్చుకుంటున్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ….ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.వన దేవతలను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో బాటిళ్లు ఇస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రోడ్లు, బస్సులు, త్రాగునీరు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అన్నారు.