మరో సారి తెర పైకి.. తెలుగు విద్య.. కారణం పవన్ కళ్యాణ్

-

తెలుగు భాషకు పట్టం కట్టడమే గిడుగుకి నిజమైన నివాళి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాషను… గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి అని ప్రశంసించారు. ప్రజల వాడుకలో ఉన్న భాషనే గ్రంథ రచనలోకి తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ఉద్యమించిన వ్యవహారిక భాషా ప్రేమికుడాయన అని అన్నారు. గిడుగు వంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలు ఇచ్చిన స్పూర్తితోనే… తెలుగు భాషలోని తీయదనాన్ని నవతరానికి, భావితరాలకు అందించే సదుద్దేశంతో జనసేన ‘మన నుడి- మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్పష్టంగా చెప్పిందని… రాష్ట్రంలో చిన్నారులకు మాతృభాష దూరం కాకుండా చూడటం అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలను తెలుగు భాషలో సాగించడమే కాదు… అందులో వాడుక భాషను తీసుకురావలసిన అవసరం ఉందన్నారు.ఈ మాటలు వెనకాల వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఇంగ్లీష్ మీడియం గురుంచి చెప్పినట్టు ఫ్యాన్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news