నిండుకుండను తలపిస్తున్న నాగార్జున సాగర్‌..!

-

కృష్ణా బేసిన్‌లో అతి పెద్దదైన నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉంది. ఎగువ నుంచి వరద తగ్గటంతో గేట్లను మూసివేశారు. కుడికాల్వకు 8,221, ఎడమ కాల్వకు 8,022 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అన్ని కలిపి ప్రాజెక్ట్ నుండి మొత్తం 44,277 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం నుంచి కూడా సాగర్‌కు నీటిని వదులుతున్నారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.80 అడుగుల మేర నీరు ఉంది.

అయితే సాగర్ ను సందర్శించడానికి పర్యాటకులు ఎవరు రావద్దని తెలిపారు పోలీసులు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ప‌ర్యాట‌కులు సంద‌ర్శించ‌కుండా శివాల‌యం ఘాట్లో , ఆంజ‌నేయ ఘాట్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జ‌ల విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారిలో బారికేడ్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news