మరో సారి నటుడు ప్రకాశ్ రాజ్ పై ట్రోల్స్..!!

-

బాలీవుడ్ లో రీచా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది . ఇక ఆమె మాది ఆర్మీ కుటుంబమే, నాది అదే రక్తం, నన్ను క్షమించండి అన్నాకూడా ఈ వేడి తగ్గడం లేదు. చాలా మంది ఈ దేశం నుండి వెళ్లిపో అంటూ చీకొడుతున్నారు. దీనిపై చాలా మంది ఆమెను తప్పు పడుతూ ట్వీట్ చేశారు. వారిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు.

రీసెంట్ గా ఈ వివాదం లోకి కారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ కూడా అడుగు పెట్టారు.అయితే రీచా చద్దా వ్యాఖ్యలను మాత్రం ప్రకాష్‌ రాజ్ సమర్థించాడు. రీచా చద్దాను తప్పుబడుతూ అక్షయ్ కుమార్ వేసిన ట్వీట్‌ మీద కూడా ప్రకాష్‌ రాజ్ సెటైర్ వేశాడు. అందరూ ఆమెను వ్యతిరేకిస్తూ ఉంటే తాను మాత్రం ఆమెను వెనకేసుకొచ్చాడు.

అక్షయ్ కుమార్ ఆమెను ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారని  ప్రకాష్ రాజ్ అన్నాడు. రీచా చద్దాకు నేను సపోర్ట్‌గా నిలుస్తున్నాను.. ఆమె ఏ ఉద్దేశ్యం ఏంటో నాకు తెలుసు అంటూ ప్రకాష్‌ రాజ్‌ మద్దతుగా కామెంట్స్ చేశాడు. దీనితో ప్రకాశ్ రాజ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా తయారు అయ్యారు.కొందరు మాత్రం గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ కూడా ఇలానే ఆర్మీ ను కించ పరిచారు అని అప్పటి ట్వీట్స్ షేర్ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news