విమానం కింద వేలాడుతూ.. లండన్‌ టూ హాలెండ్‌

-

విమానంలో జర్నీ అంటే అందరికీ ఇష్టమే. కానీ.. విమానం కింద వేలాడుతూ జర్నీ అంటే అది సాహాసానికే బ్రాండ్‌ అనాలి. ఇలాంటి సీన్లు కేవలం సినిమాల్లో చూస్తుంటం. క్రిష్‌ సినిమాలో హీరో హృతిక్‌రోషన్, ప్రయాణికులను కాపాడేందుకు రవ్‌వే మీద ఉన్న విమానం టైర్లకింద నిలబడి వాటి గేర్లను సరి చేస్తాడు. ఈ ఘటన అక్కడ రీల్‌లో జరిగితే ఇక్కడ మాత్రం రియల్‌గానే జరిగింది.

గంట సేపు..

కెన్యాకు చెందిన 16 ఏళ్ల బాలుడు విమాన టైర్ల వద్ద ఉండే ల్యాండింగ్‌ గేర్‌ను పట్టుకొని లండన్‌ నుంచి హాలెండ్‌కు దాదాపుగా గంటపాటు ప్రయాణం చేశాడు. ఇలా ప్రయాణం చేసే వారిని ‘స్టోఅవే’ అంటారు. ఈ తరహా ప్రయాణించే వారిలో ఎక్కువ మంది కొద్దిదూరం ప్రయాణించాక జారీ కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ. ఈ బాలుడు సురక్షితంగా దిగి అందరినీ ఆశ్చర్చానికి గురి చేశాడు.

19,000 అడుగుల ఎత్తులో..

టర్కీ ఏయిర్‌లైన్స్‌కు చెందిన సరుకు రవాణా విమానం, ఇంగ్లాండ్‌లోని స్టాన్‌స్టెడ్‌ ఏయిర్‌పోర్ట్‌ నుంచి నెదర్లాండ్‌లోని మాస్ట్రిక్ట్‌ ఏయిర్‌పోర్టుకు చేరుకుంది. కాసేపటికి విమానం ల్యాండింగ్‌ గేర్ల వద్ద ఓ 16 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విమానం 19,000 అడుగుల ఎత్తులో ఉత్తర సమూద్రం మీదుగా ప్రయాణించింది. ఈ సమూద్రం మీదుగా ప్రయాణించేటప్పుడు విపరీతమైన శీతల వాతవరణం ఉన్న కూడా పాణాలతో బయటపడటం విశేషం. ప్రస్తుతం ఆ బాలుడు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news