టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్ధులు లేరన్నారు ఆయన. ఇక వైసీపీలో కొంత కాలంగా గ్రూపులు ఉన్నాయని అయినా ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ అధిష్టానం కొన్ని సూచనలు చేసిందని అన్నారు. పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు అందరూ వ్యవహరిస్తారని అనారు. ఇక నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిందన్న వంశీ, నిమ్మగడ్డ నియంతృత్వ పోకడలకు పోతున్నారఇన్ అన్నారు.
ఫిర్యాదులు వస్తే పరిశీలించాలి కానీ.. గృహ నిర్బంధం విధించడం ఏమిటీ..? అని ప్రశ్నించారు. విచారణ జరపకుండా అనామకుల కంప్లైంట్లపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు..? అనిన్ అయన ప్రశ్నించారు. చంద్రబాబు ఫేస్ టైములో చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా..? అని పేర్కొన్న ఆయన ఎస్ఈసీ చర్యలకు అన్ని సరిపెడతామని అన్నారు. ఏకగ్రీవాలనేవి కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచే ఉన్నాయని, ఏకగ్రీవాలకు ప్రొత్సహకాల జీవో ఇచ్చింది చంద్రబాబేనని అన్నారు. కొత్తగా ఈ రోజే ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని టీడీపీ ఏకగ్రీవాలు కూడా బలవంతమేనా..? అని ఆయన ప్రశ్నించారు.