ఒక్కో డాక్టర్ 60 మంది రోగులకు వైద్యం, ఏపీలో జూనియర్ డాక్టర్ల కన్నీరు…!

-

విజయవాడలో ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ చేస్తున్న సమ్మె సంచలనంగా మారింది. తాజాగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రేపట్నుంచి విధులు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. గత ఆర్నెళ్లుగా తమ డిమాండ్లపై పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా నేటివరకు వాటన్నింటిని పరిష్కరించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ తో పోలిస్తే ఏపీలో మాకిస్తున్న వేతనాలు చాలా తక్కువ అంటూ కన్నీరు పెడుతున్నారు. కనీసం 45 శాతం జీతాలు పెంచాలని గత ఆరు మాసాలుగా పోరాటం చేస్తున్నామని కాని ఏమీ పరిష్కారం కాలేదని అంటున్నారు. కోవిడ్-19 వైద్య చికిత్సకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని అంటున్నారు. ఒక్కో వైద్యుడు 60 మంది పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి డాక్టర్లను నియామకాలు చేపడుతున్నప్పటికీ కూడా వారెవరూ కూడా క్షేత్రస్థాయిలో వచ్చి వైద్య టెస్ట్ లు చేసే దాఖల్లాలేవని, ఒక్కో డాక్టర్… ముగ్గురు డాక్టర్లు చేసే పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news