ప్ర‌భుత్వ ప‌థ‌కాల న‌గ‌దు మీ బ్యాంక్ అకౌంట్‌లో ప‌డిందో, లేదో ఇలా తెలుసుకోండి..!

-

మ‌న దేశంలో స్మార్ట్‌ఫోన్లు, ఇంట‌ర్నెట్‌ను వాడేవారు చాలా మందే ఉన్నారు. వారంద‌రూ త‌మ త‌మ బ్యాంక్ అకౌంట్ల‌లో న‌గ‌దు క్రెడిట్ లేదా డెబిట్ అయితే వెంట‌నే అకౌంట్‌లోకి లాగిన్ అయి చూసుకోవ‌చ్చు. కానీ చ‌దువురాని వారి ప‌రిస్థితి ఏమిటి..? అందుకు వారు బ్యాంకుల‌కే వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అలాంటి అనేక మంది నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా త‌మ బ్యాంక్ అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అవుతుండే సరికి.. బ్యాంకులో ఎంత మొత్తం బ్యాలెన్స్ ఉందో తెలుసుకునేందుకు వారు.. రోజూ బ్యాంకుల‌కు వెళ్తున్నారు. అయితే అలాంటి వారు త‌మ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి సంబంధిత బ్యాంకుకు చెందిన ఓ నంబ‌ర్‌కు కాల్ చేసి.. త‌మ అకౌంట్ల‌లో ఎంత న‌గ‌దు బ్యాలెన్స్ ఉందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. ఇక అందుకు గాను ఆయా బ్యాంకులు ప‌లు నంబ‌ర్ల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచాయి. అవేమిటంటే…

one missed call to bank can give balance details in account

బ్యాంకు అకౌంట్ల‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఆయా బ్యాంకుల‌కు చెందిన కింది ఫోన్ నంబ‌ర్ల‌కు వినియోగ‌దారులు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. వెంట‌నే వారి వారి ఫోన్ల‌కు ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. ఆ మెసేజ్‌లలో బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ న‌గ‌దు వివ‌రాలు ఉంటాయి. ఇలా సుల‌భంగా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవ‌చ్చు. ఇక వినియోగ‌దారులు బ్యాంకుల‌కు కాల్ చేయాల్సిన ఆ ఫోన్‌ నంబ‌ర్ల వివ‌రాలు చూడండి..!

బ్యాంక్ పేరు  — బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కాల్ చేయాల్సిన నంబ‌ర్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  — 9555244442
కెనరా బ్యాంక్ — 09015483483, 09015734734
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా — 09223766666, 1800112211
పంజాబ్ నేషనల్ బ్యాంక్ — 18001802222, 18001802223, 01202303090
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర — 9222281818
యాక్సిస్ బ్యాంక్ — 18004195959
పంజాబ్ & సింధ్ బ్యాంక్ — 7039035156
యూకో బ్యాంక్ — 9278792787
దేనా బ్యాంక్ — 09278656677, 09289356677
బ్యాంక్ ఆఫ్ ఇండియా — 9015135135
ఐసీఐసీఐ — 9594612612
ఇండియన్ బ్యాంక్ — 9289592895
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ — 08067205757
హెచ్‌డీఎఫ్‌సీ — 18002703333, 18002703355
కార్పొరేషన్ బ్యాంక్ — 9268892688
ఐడీబీఐ — 18008431122
యెస్‌ బ్యాంక్ — 9223920000
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా — 09223008586
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా —  09015431345
బ్యాంక్ ఆఫ్ బరోడా — 8468001111
అలహాబాద్ బ్యాంక్ —  9224150150

Read more RELATED
Recommended to you

Latest news