సంక్రాంతి బరిలో మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ …!

-

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరు తనయుడు రాం చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే 40 శాతం టాకీ పార్ట్ కంప్లీటయున ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను కంప్లీట్ చేసి సంక్రాతికి భారి స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కొరటాల.

 

ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కూడా కొంత వరకు టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సీనియర్ స్టార్స్ ఇద్దరు బ్కాసాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారని తెలుస్తుంది.

సూపర్ స్టార్ రజినీ కాంత్ “అన్నాత్తే” సినిమాను 2021 సంక్రాంతి బరిలోనే దిపబోతున్నట్టు యూనిట్ ముందుగానే క్లారిటి ఇచ్చింది. మొత్తానికి ఈ సంక్రాంతికి టాలీవుడ్ మెహాస్టార్ కోలీవుడ్ సూపర్ స్టార్ భారీ స్థాయిలో పోటీ పడబోతుండటం రెండు ఇండస్ట్రీలల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక రజనీకాంత్ దర్బార్ ఈ ఇయర్ ప్రారంభంలో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news