తెలంగాణలో మరో ఘోర ప్రమాదం..

Join Our Community
follow manalokam on social media

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా మారాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్ గూడ వద్ద ఒక డీసీఎం వ్యాన్ డివైడర్ ని ఢీ కొట్టింది. దీంతో పలువురికి గాయాలు అయినట్లు చెబుతున్నారు.

ప్రమాద సమయంలో డిసిఎంలో సుమారు పాతిక మంది కార్మికులు ఉండడంతో వారిలో చాలా మందికి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. వీరంతా ఆంధ్ర ప్రదేశ్ నుంచి పఠాన్ చెరు లోని ఒక కంపెనీలో పనిలో చేరేందుకు వస్తున్నట్లు గుర్తించారు. తీవ్రగాయాలైన వారిని అందరిని దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....