బ్రేకింగ్ : విజయవాడలో మరో హత్య.. ప్రేమించడం లేదని !

-

విజయవాడలో వరుస హత్యాకాండలు కలకకం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న రియల్ ఎస్టేట్ గొడవల్లో స్నేహితుడినే ఒక వ్యక్తి చంపించాగా తనను ప్రేమించడం లేదన్న పాపానికి ఓ నర్స్ మీద పెట్రోల్ పోసి తానూ పోసుకుని చనిపోయాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడు విజయవాడలో మరో దారుణం జరిగింది. విజయవాడలోని మాచవరంలో చిన్న స్వామి అనే ప్రేమోన్మాది తనని ప్రేమించడం లేదన్న కోపంటో దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడిచేశాడు.

తన ప్రేమను నిరాకరించిందని ఏకంగా తేజస్విని ఇంటికెళ్లి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కత్తితో ఆమె మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అయితే ఆమెని అలా చూసిన ఆ ప్రేమోన్మాది తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ఆమెను, అతడిని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం స్వామి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఇంజనీరింగ్ చాడువ్తోన్న తేజస్వినిని స్వామి ప్రేమించమని వేధింపులకు గురిచేస్తున్నట్టుగా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news