విటమిన్ సి లోపం ఉంటే ఈ సమస్యలు వస్తాయి..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు తీసుకోవాలి. ప్రతి రోజు మంచి ఆహారం తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం లాంటివి పాటిస్తూ ఉండాలి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్స్ సహాయ పడతాయి. అన్ని విటమిన్స్ లాగే విటమిన్ సి కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఒకవేళ ఇంకా విటమిన్ సి లోపం ఉంటే కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. మరి ఇప్పుడు వాటి కోసం తెలుసుకుందాం.

ముక్కు నుండి రక్తం కారడం:

విటమిన్ సి లోపం ఉండడం వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది. విటమిన్ సి ని కనుక ప్రతి రోజూ తీసుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉండొచ్చు.

మంచి కంటి చూపు:

విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రతి రోజు విటమిన్ సి తీసుకోవడం వల్ల మీకు కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

చర్మానికి మంచిది:

మీ చర్మం జీవం లేకుండా పొడి బారిపోయినట్లు ఉంటే అప్పుడు ఎక్కువ విటమిన్ సి తీసుకోండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి.

విటమిన్ సి కోసం మీరు జామ కాయ, నిమ్మ రసం, చెర్రీస్, కివి, కమల, బ్రోకలీ, బొప్పాయి, పార్స్లీ వంటివి తీసుకోవాలి. విటమిన్ సి బాడీలో స్టోర్ అయి ఉండదు. కాబట్టి ప్రతి రోజూ ఒక పండును తీసుకోండి. వేడి నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news