ఆర్టికల్ 370 రద్దు… ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూసిన పరిణామం. ప్రపంచం మొత్తం కూడా షాక్ అయిన పరిణామం. ఆర్టికల్ రద్దు జరిగి నేటికి సరిగా ఏడాది. ఏడాది క్రితం పార్లమెంట్ లో హోం శాఖా మంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశ పెట్టగా దీనిపై ఎన్నో చర్చల తర్వాత అది ఆమోదం పొందింది. ఈ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించింది అనే ఆరోపణలు ఉన్నా సరే ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు.
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ కూడా భారత్ లో పూర్తిగా లీనం అయింది. జమ్మూ కాశ్మీర్ ని విభజించడం, లడఖ్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం జరిగాయి. 1954 నాటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. ఈ రద్దుతో ఆ గుర్తింపు పోయింది. ఆగస్టు 5 న పార్లమెంటులో తీర్మానాలు తీసుకువచ్చే వరకు 70 ఏళ్ళ పాటు ప్రత్యేక రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా మరియు దాని పునర్వ్యవస్థీకరణ అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
ఆర్టికల్ 370ని రూపొందించింది ఎవరో తెలుసా?