కేజీ నుండి పిజి వరకు ఆన్లైన్ తరగతులే : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

-

జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆఫ్ లైన్ తరగతులు స్టార్ట్ చేయాలని అనుకున్నా….కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారని వెల్లడించారు. ఇక కేజీ నుండి పిజి వరకు ఆన్లైన్ తరగతులేనని… డిగ్రీ, పిజి, డిప్లొమా పరీక్షలు యథాతథమని స్పష్టం చేశారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ డేట్స్ లో ఎలాంటి మార్పులు లేవని.. 46 జీఓ ను అమలు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ కి మరోసారి చెబుతున్నామని తెలిపారు.

నెల వారిగా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని.. ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పరిస్థితిలు చక్కబడ్డాక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని… ద్వితీయ సంవత్సరం ఫలితాలు క్రైటీరియా నచ్చక పోతే ఆ విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రాక్టీకల్స్ మార్క్స్ మాత్రం అందరికి గరిష్టమని.. గతంలో ఫెయిల్ అయిన వారికి 35శాతం మార్కులతో పాస్ చేశామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news