తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనుంది. దీనికి సంబందించిన టైమ్ టేబుల్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. దూరదర్శన్, టీ-శాట్ ద్వారా మూడవ నుంచి పదవ తరగతి వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయి. మూడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు నిర్వహించనున్నారు.
ఒక్కో క్లాసు సమయం ముప్పై నిముషాలు ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇక అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు ఏ విద్యాసంస్థలు తెరవబడవు.