ఏపీ గ్రూపు-2 సిలబస్, పరీక్ష పేపర్లలో మార్పులు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై స్క్రీనింగ్ టెస్టును 150, మెయిన్ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్టును 150, ప్రధాన పరీక్షను మూడు పేపర్లతో నిర్వహించారు. మొత్తం 450 మార్కులు ఉండేవి. ఆర్థికశాఖ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం.. పరీక్ష, సబ్జెక్టులు, మార్కుల వివరాలిలా ఉన్నాయి.
- స్క్రీనింగ్ టెస్టు : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ – 150
- మెయిన్స్ పేపరు-1 : ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం – 150
- పేపరు-2 : ఆంధ్రప్రదేశ్, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్ అండ్ టెక్నాలజీ- 150
- గ్రూపు-1కు మరో 19 పోస్టులు
మరోవైపు గ్రూపు-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న 92 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 27/2018 నోటిఫికేషన్ అనుసరించి నియమించిన వారిలో కొందరు విధుల్లో చేరనందున మిగిలిన 17 పోస్టులు, భర్తీకాని మరో రెండు పోస్టులను ప్రస్తుత నోటిఫికేషన్ (28/2022)కు కలిపినట్లు వెల్లడించింది.