హార్రర్ + కామెడీ +ఫ్యామిలీ సెంటిమెంట్ = ‘ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ’

-

కామెడీ సినిమాలంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఆ కామెడీకి కాస్త హార్రర్ తోడైతే వచ్చే మజాయే వేరు కదా. ఈ హార్రర్ జోన్ లో కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ అయితే ఉంటుంది కదా. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాయే ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ.

సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు తెరకెక్కించిన 76వ చిత్రం ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ’. మహాశివరాత్రి పర్వదినాన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ హారర్ కామెడీ మూవీని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించారు. సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు తనయుడు యశ్వంత్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా నటి సత్యకృష్ణన్ కుమార్తె అనన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అలానే మరో కీలక పాత్రను జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్‌ పోషించాడు.

రేపు థియేటర్లలోకి వస్తోన్న తమ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని డైరెక్టర్ రేలంగి నరసింహారావు చెప్పారు. తమ సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరారు. మరోవైపు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ.. తను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణమైన రేలంగి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ వీకెండ్ లో కాస్త ఫన్ కోసం వెయిట్ చూస్తున్నారా మీరు. అయితే ఈ సూపర్ క్రేజీ కాంబోలో వస్తున్న ఊ అంటావా మావ ఉ ఊ అంటావా మావ సినిమా చూసేయండి. హాయిగా.. జాలీగా మీ హాలిడేస్ ను ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news