ఊరుపేరు భైరవకోన నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

-

హీరో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన నుండి ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది శేఖర్ చంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికి విడుదలైన అప్డేట్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా మరొక అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా 16న రిలీజ్ కాబోతోందట ఎట్టకేలకు ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది ప్రీమియర్ షోపై సందీప్ కిషన్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కి రెండు రోజులు ముందుగానే ఫిబ్రవరి 14 నుండి ప్రీమియర్స్ వేయబోతున్నట్లు ప్రకటించారు. రిలీజ్ తేదీ మారింది తప్ప సంకల్పం మారలేదు అని అన్నారు. ఈ ఫిబ్రవరి 14 నుండి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయని పోస్ట్ చేశారు సందీప్ కిషన్.

Read more RELATED
Recommended to you

Latest news