టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు అర్ధరాత్రి సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. ఏపీలో టీడీపీ జనసేన బిజెపి కలిసి పనిచేసే దిశగా చర్చలు సాగించారు. ఈ భేటీ పై కీలక వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత సుజనా చౌదరి. చంద్రబాబు అమిత్ షా జెపి నడ్డాల మధ్య చర్చలు చాలా పాజిటివ్గా జరిగాయని తెలిపారు.
టిడిపి జనసేన బిజెపి కూటమి అధికారిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన స్థానాల కంటే కూడా ఎక్కువగానే సాధిస్తుందని నా అంచనా అన్నారు.. వైసిపి పై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి. టిడిపి బిజెపి మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పోరా చూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి కానీ ఫలించ లేదన్న ఆయన స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్టయితే ఏపీలో ఈ విభేదాలు పరిస్థితులు ఉండేవి కావన్నారు. చర్చలు సఖ్యత అన్నది రెండు వైపులా సానుకూల పరిస్థితులు ఉంటేనే కదా జరిగేదని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో మరల కలిసి మెలిసి పనిచేసే అవకాశం ఉంటుందని అభిప్రాయాన్ని ఉదాంతం మనకు తెలిసిందే కదా అని పేర్కొన్నారు.