గుడ్ న్యూస్ : ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ , ఇంటర్ పరీక్షలు రద్దు

-

తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదవ తరగతి , ఇంటర్ పరీక్షలను రద్దు చేసి.. మినిమం మార్క్స్ తో పాస్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. గతేడాది కూడా ఇలాగే పరీక్షలు రద్దు అయ్యాయి. మినిమం పాస్ మార్క్స్ వేసి అందరిని ఉత్తీర్ణులను చేసింది ప్రభుత్వం. గతేడాది పాస్ చేశారన్న నేపథ్యంలో.. ఈ ఏడాది అడ్మిషన్స్ , పరీక్ష ఫీ చెల్లించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది ఫీజు చెల్లించిన వారందరిని పాస్ చేసింది సర్కార్.

ఈ యేడాది 63 వేల 581 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించగా.. 47 వేల 392 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫీ చెల్లించారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో మొత్తం లక్షా 10 వేల 9 వందల 73 మంది విద్యార్థులందరూ పాస్ అయ్యారు. విద్యార్థులు ఇంప్రూవ్ మెంట్ రాసుకునే వారికి పరిస్థితిలు చక్కబడ్డాక అవకాశం కల్పించనుంది. ఉన్నత విద్య కోర్సుల్లో జాయిన్ కావాలనుకుంటే ఈ మార్క్ లనే అర్హత మార్క్స్ గా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news