మరో వివాదం : తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కోకు సుప్రీం నోటీసులు

-

తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో కు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదని 84 మంది ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1150 మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణి చేయగా.. ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని ఏపీ ప్రభుత్వం చేర్చుకుంది. అటు తెలంగాణ ప్రభుత్వం 84 మందిని మినహాయించి మిగిలినవారిని చేర్చుకుంది. దీంతో.. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు 84 మంది విద్యుత్ ఉద్యోగులు.

supreme court
supreme court

జెన్కో, ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే.. ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డితో పాటు కార్పోరేట్ కార్యాలయ అధికారి గోపాలారావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక తదుపరి విచారణ జూలై 16కి వాయిదా సుప్రీంకోర్టు. కాగా తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జల వివాదం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news