ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో భీభత్సం సృష్టిస్తున్న అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, సిబ్బంది, రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చిత్తూరు జిల్లా రామాపురం వద్ద ఏనుగు సంచరింస్తుందని సమాచారం తెలుసుకున్నారు అటవీశాఖ అధికారులు.
ఈ గజరాజం స్వైర విహారం చేస్తూ రెండ్రోజుల్లో ముగ్గురిని తొక్కి చంపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగును బంధించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో గురువారం రామాపురంలోని ఓ చెరుకు తోటలో వున్న ఏనుగుకు విజయవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు.