కేరళలోని కొక్కాదవ్ గ్రామంలోని చెరుపుళా– తిరుమేని రహదారికి సమీపంలో ఉండే జోషి మాథ్యూ ఇళ్లు పచ్చని చెట్ల మధ్య పర్యావరణహితంగా ఉంటుంది. దాదాపు 80 రకాల కూరగాయలు ఆకుకూరల పంటలను పండిస్తున్నారు జూలీ, జోషి. అందుకే వారు మాకు ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు తెలియవని అంటున్నారు. ఎందుకంటే బయట కూరగాయలు కొని దాదాపు ఐదేళ్లవుతుందంట. బియ్యం, గోధుమలు మినహా అన్ని ఇంట్లోనే పెంచుకుంటున్నారు.వారు గత 50 ఏళ్ల నాటి ఎరుపురంగా లాటరైట్ పెంకులతో కట్టిన ఇంట్లో ఉంటున్నారు.ఇది బయటి ఉష్ణోగ్రత కంటే లోపల చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఈ దంపతులకు ఆ ఊరిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జోషి వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. మొదట్ల కూరగాయల సాగు కష్టతరం అనుకున్న జోషి, అతని స్నేహితుడి విజయవంతంగా చేసిన సాగును చూసి అతడికి నచ్చింది. అతను ఫేస్ బుక్‌లో నిపుణుల సలహా, సుచనలు తీసుకున్నాడు. అది అతడికి ఎంతో ఉపయోగం కలిగిందట.
అద్భుతం చేపల పెంపకం
వారికి ఉన్న 25 సెంట్ల భూమిలో చేపలు, తేనెటీగాల పెంపకం చేస్తున్నారు. అది కూడా అంతా సెంద్రీయ పద్ధతిలోనే. అలాగే కోళ్ల పెంపకం, ఆవుని కూడా ఉంది. వారి ఆవరణలోనే రెండు చిన్నటి పాండ్‌లను కట్టారు. అందులో 800 చేపలు పెంచుతున్నారు. ఇవి ఆ పాండ్‌లో నాచుని తింటాయి. ఇందులో జెయింట్ గౌరమి, రెడ్ టిలాపియా, అసోంవాలా వంటి రకాల చేపలు ఉన్నాయి. మొదట కేవలం వారికోసమే చేపల పెంపకం మొదలుపెట్టారు. లాక్‌డౌన్ సమయంలో మార్కెట్లు అన్ని బంద్ ఉండటంతో వారు చేపల అమ్మకం కూడా మొదటు పెట్టారు. దాదాపు 3000 చేపలను రూ.10 ఒక పీస్ చొప్పున విక్రయించారు. ఈ విధంగా వారికి ఆదాయం కూడా వచ్చింది.
వారు మొక్కలకు నీరు పెట్టే విధానం అయితే మరో అద్భుతం. ఈ ప్రక్రియను మళయాలంలో ‘తిరి నానా’ అని పిలుస్తారంట. ఒక బకెట్‌లో నీటిని నింపి, దానిపై ఒక ట్రేను కప్పుతారు. ట్రేలో చిన్న రంధ్రం చేసి, తాడు చివరకు కలుపుతారు. మరోక చివర ట్రేపైన పెట్టిన గ్రో బ్యాగుల గుండా వెళుతుంది. ఈ పద్దతితో మొక్కలకు నీరు అందుతూ ఉంటుంది. దీనివల్ల సమయం, నీరు వృథా కాదు. వారానికి రెండుమార్లు బకెట్‌ను నింపుతారు.
ఆర్గానిక్ పెస్టిసైడ్స్
జూలీ మొదట్లో రెండు మూడు మొక్కలు నాడటంతో మంచి ఫలితం రావడంతో వాటిని మరింత అభివృద్ధి చేసింది. విత్తనాల కోసం స్థానిక రైతులను కలిశారు. వారి నుంచి ఒక ఆవును కొన్నారు. సెంద్రీయ పద్ధతిలో తయారు చేస్తుంది జూలీ. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, వేప పేస్టు, ఆవుపేడతో కంపోస్టు తయారు చేసి మొక్కలకు ఉపయోగిస్తున్నారు. సెంద్రీయ పంట రుచి చూశాక వారికి బయట కూరగాయలు రుచించటం లేదట.
జోషీ దంపతులకు ఇద్దరుపిల్లలు. వారు స్కూలుకు వెళ్తున్నారు. వారి బాగోగులు చూసుకుంటూనే జూలీ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. పాడైపోయిన టైర్లను ప్లాంటర్లలో రీసైకిల్ చేశారు. మొదట చెట్ల మధ్య ఖాళీ స్థలంలో సాగు చేశారు. ఆ తర్వాత చేపలు, తేనెటీగల పెంపకం కోసం వాటిని మిద్దె తోటగా మార్చారు.
తేనెటీగల పెంపకం
ఆ ఇంటికి మరో ఆకర్షణ తేనెటీగల పెంపకం. ఏడాదికి దాదాపు 20 కిలోల తేనె లభిస్తుంది. 80 తేనెతట్టెలను పెంచారు. అందులో 20 గ్రామంవారికే విక్రయించారు.దీనివల్ల రూ. 80 వేల ఆదాయం లభించిందని చెబుతాడు జోషి. మొదట బంధువులు, స్నేహితులకే కూరగాయలు ఇచ్చే వాళ్లం, కరోనా వల్ల వ్యాపారం వైపు బాటలు వేయాల్సి వచ్చిందని జూలీ అన్నారు. ఏదేమైనా మనం కనీసం తినడానికి సరిపోయే తోట పంటను పెట్టుకోవాలి. అది సులభం అనిపిస్తే దానివల్ల లాభాలు కూడా ఉన్నయని జూలీ అంటోంది.