ఖరీదైన గొర్రె గురూ.. ధర రూ.3.50 కోట్లు..!

-

అవును మీరు వింటున్నది నిజమే.. ఆ గొర్రె ఖరీదు అక్షరాల రూ.3.50 కోట్లు. అదేంటి.. అంత ఖరీదైన గొర్రె ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అనుకుంటున్నారా. అవును మరి ఆ స్కాట్‌లాండ్‌ లో ఉంది. దాని స్పెషల్ ఏంటో తెలియాలంటే పూర్తి వివరాలు చూడాల్సిందే. గురువారం నాడు స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన లైవ్‌స్టాక్‌ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. స్టాక్‌పోర్టుకు చెందిన ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి.

టెక్సెల్‌ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందినవి. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్‌ పౌండుల ధర పలుకుతుంటాయి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్‌ చేస్తూ ఉంటారు. అలాగే వాటి ఊలుకి మంచి డిమాండ్ ఉంది..నాణ్య‌మైన ఊలు అందివ్వ‌డంలో ఈ గొర్రెల ప్ర‌త్యేక‌త. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును డైమండ్‌ బ్రేక్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news