బీజేపీ కీలక నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోందా ? ఏపీలో ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు కొల్లబోతున్నాయనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆయనను హీరోగా భావించి ప్రచారం చేసిన కమలనాథులు.. తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన పేరు ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానిగా ఆయన ఏపీకి ఏం చేశారంటూ.. ప్రశ్నలు సంధిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరోపక్క, పార్టీలోనూ నేతల మధ్య సఖ్యత లేదు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు సాగుతోంది. అసలే ఓటు బ్యాంకు లేని పార్టీ.. అయినప్పటికీ.. ఏదో ఆధిపత్యం సాధించాలనే తెగింపు కనిపిస్తోంది. దీంతో ప్రధానిగా మోడీ ఏం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
మరి ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉందా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. దేశంలోని పలు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రధాని మోడీని దేవుడికన్నా ఎక్కువగా భావిస్తున్నారు. మన దగ్గర కూడా అంతే. అయితే, దీనికిభిన్నంగా ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాత్రం మోడీని తురుపు ముక్కగా కూడా చూడలేమని చెబుతున్నారు. మోడీని చూసి ప్రజలు ఓట్లు వేయరని తేల్చి చెప్పారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పని చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. కాబట్టి ఎవరికి వారు తమ వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు.
నిజానికి ఈ వ్యాఖ్యలుఏపీకి కూడా వర్తిస్తాయి. ఇక్కడ కూడా 2014లో ఉన్న మోడీ ఛరిష్మా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాన ఆకర్షణగా మారారు. దీంతో దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో ఏపీలో బీజేపీ వికసించింది. అదేవిధంగా ఇద్దరు ఎంపీలు కూడా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ మానియాకు తోడు ఏపీలో టీడీపీతో పొత్తు, జనసేన సపోర్ట్ కూడా కలిసి వచ్చాయి.
కానీ, గత ఏడాది ఎన్నికల్లో మోడీ వచ్చి ప్రచారం చేసినా.. ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. పైగా ఇప్పుడు ఆ ప్రభావం మరింతగా ఎక్కువైంది. ప్రధాని మోడీని పట్టించుకునే పరిస్థితి ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. హోదా ఇవ్వలేదని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుడుతుంటే.. రాజధాని అమరావతి విషయంలో పట్టించుకోవడం లేదని మూడు జిల్లాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాపు స్ట్రాటజీలు, నాయకత్వం మార్పు చేస్తున్నా ఏపీలో బీజేపీ నాయకులకు, బీజేపీకి ఎంత మాత్రం ఒరిగేది లేదన్నది స్పష్టమవుతోంది. బీజేపీ కీలక నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోందా ? ఏపీలో ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు కొల్లబోతున్నాయనే విషయం తెలిసిందే.
ఒకప్పుడు ఆయనను హీరోగా భావించి ప్రచారం చేసిన కమలనాథులు.. తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన పేరు ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానిగా ఆయన ఏపీకి ఏం చేశారంటూ.. ప్రశ్నలు సంధిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరోపక్క, పార్టీలోనూ నేతల మధ్య సఖ్యత లేదు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు సాగుతోంది. అసలే ఓటు బ్యాంకు లేని పార్టీ.. అయినప్పటికీ.. ఏదో ఆధిపత్యం సాధించాలనే తెగింపు కనిపిస్తోంది. దీంతో ప్రధానిగా మోడీ ఏం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
మరి ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉందా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. దేశంలోని పలు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రధాని మోడీని దేవుడికన్నా ఎక్కువగా భావిస్తున్నారు. మన దగ్గర కూడా అంతే. అయితే, దీనికిభిన్నంగా ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర చీఫ్ మాత్రం మోడీని తురుపు ముక్కగా కూడా చూడలేమని చెబుతున్నారు. మోడీని చూసి ప్రజలు ఓట్లు వేయరని తేల్చి చెప్పారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పని చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించారు. కాబట్టి ఎవరికి వారు తమ వ్యక్తిగత సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు.
నిజానికి ఈ వ్యాఖ్యలుఏపీకి కూడా వర్తిస్తాయి. ఇక్కడ కూడా 2014లో ఉన్న మోడీ ఛరిష్మా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కనిపించలేదు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాన ఆకర్షణగా మారారు. దీంతో దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో ఏపీలో బీజేపీ వికసించింది. అదేవిధంగా ఇద్దరు ఎంపీలు కూడా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ మానియాకు తోడు ఏపీలో టీడీపీతో పొత్తు, జనసేన సపోర్ట్ కూడా కలిసి వచ్చాయి.
కానీ, గత ఏడాది ఎన్నికల్లో మోడీ వచ్చి ప్రచారం చేసినా.. ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. పైగా ఇప్పుడు ఆ ప్రభావం మరింతగా ఎక్కువైంది. ప్రధాని మోడీని పట్టించుకునే పరిస్థితి ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. హోదా ఇవ్వలేదని రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుడుతుంటే.. రాజధాని అమరావతి విషయంలో పట్టించుకోవడం లేదని మూడు జిల్లాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాపు స్ట్రాటజీలు, నాయకత్వం మార్పు చేస్తున్నా ఏపీలో బీజేపీ నాయకులకు, బీజేపీకి ఎంత మాత్రం ఒరిగేది లేదన్నది స్పష్టమవుతోంది.