ఒకరి మృతదేహం మరొకరి కుటుంబానికి ఇచ్చి పెద్ద భీబస్తవం సృష్టించిన ఘటన హైదరబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. వైద్య సిబ్బంధి చేసిన ఈ పొరపాటుకి అటు బాదిత కుటుంబం చేసిన హల్ చల్ ఆపై మూడు రోజులపాటు డాక్టర్లు స్ట్రైక్.. ఇంత జరిగినా మళ్ళీ ఇలాంటి పొరపాట్లే చేస్తున్నారు హైదరబాద్ లోని డాక్టర్లు. తాజాగా మరోసారి హైదరబాద్ తెరపైకి వచ్చింది మరో శవ పంచాయతీ కానీ ఈసారి ఈ పొరపాటు చేశారు ఉస్మానియా ఆసుపత్రి లోని వైద్య సిబ్బంధి.
వివరాల్లోకి వెళితే.. కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉస్మానియా ఆసుపత్రి ఒకటి. ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు ఇటీవల ఉస్మానియాలో చేరారు. వారిలో ఒకరు కరోనాతో, మరొకరు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా వ్యాదితో బాధపడుతున్న ఓ మహిళ చనిపోగా ఆసుయ్పత్రి యాజమాన్యం మరో మహిళా చనిపోయిందని వారి కుటుంబంతో చెప్పింది సిబ్బంధి. శ్వాస సమస్యతో బాధ పడుతున్న మహిళ బ్రతికుండటం తద్యం అని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీసులు గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపడింది.. ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం ఆచితూచి వ్యవహరించాలని బాధ్యతారహితంగా సమాచారాన్ని తెలియజేయాలని కుటుంబ సభ్యులు యాజమాన్యం పై మండిపడ్డారు.