ఉస్మానియా యూనివర్సిటీ కీలక ఆదేశాలు

-

ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్స్‌లో అనధికారికంగా ఉంటున్న వారందరినీ వెంటనే ఖాళీ చేయమని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆదేశించింది. అది కనుక జరుగక పోతే విశ్వవిద్యాలయం పోలీసులను ఉపయోగించి చట్టపరమైన చర్యలను ప్రారంభించవలసి వస్తుందని ప్రకటించింది. కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విశ్వవిద్యాలయం అన్ని హాస్టళ్లను మూసి వేసింది. ప్రభుత్వ సూచనల ప్రకారం మరియు నీరు మరియు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసింది.

అయితే, ఇటీవల నీరు మరియు విద్యుత్ సరఫరా లేనప్పటికీ విద్యార్థుల ముసుగులో ఉన్న కొద్ది మంది వ్యక్తులు అనధికారికంగా హాస్టల్ గదులలో ఉంటున్నారని , విశ్వవిద్యాలయం గమనించింది. ఈ కారణంగా విశ్వవిద్యాలయంలో శాంతిభద్రతల సమస్య ఉందని అమలులో ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తున్న హాస్టళ్లలో అక్రమ మరియు అనధికారికంగా బస చేయడాన్ని విశ్వవిద్యాలయం తీవ్రంగా పరిగణించిందని ఒక ప్రకటన తెలిపింది. అనధికారికంగా ఉంటున్న వారందరూ వెంటనే ఖాళీ చేయాలి లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకటించారు.  

 

Read more RELATED
Recommended to you

Latest news