బిగ్ బాస్ -3 పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు మిన్నంటుతోన్న సంగతి తెలిసిందే. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం..అటుపై దర్శక, నిర్మాత, రాజకీ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్-3పై విచారణ చేపట్టాలంటూ కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి పోరాడేందుకు సిద్దమయ్యారు. దీంతో బిగ్ బాస్-3పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీజన్-3 ఉంటుందా? ఊడుతుందా? అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. తాజాగా ఈ వ్వవహారంలోకి ఉస్మానియా యూనివర్శీటి విద్యార్ధులు ఆందోళన బాట పట్టడం సంచలనమైంది. లైంగిక వేధిపులతో అట్టుడికిపోతున్న బిగ్ బాస్ సీజన్ -3కి నాగార్జున హోస్ట్ గా చేయడాన్ని తప్పు బట్టారు.
షో ని నిలిపివేయాలని లేకపోతే బిగ్ బాస్ నిర్వాహకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాగార్జున ఇంటి ముందు భైటాయిస్తామని ప్రకటించారు. బిగ్ బాస్ తో కుమ్మకు అయినా కంటెస్టెంట్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. భారతదేశ సంస్కృతిని..అందులోనూ తెలుగు సంస్కృతిని పాతాళానికి తొక్కేసి పాశ్ కల్చర్ కు అలవాటు పడటాన్ని తప్పుబట్టారు. సాధారణంగా కాస్టింగ్ కౌచ్ అనేది బాలీవుడ్ లో వినిపించే మాట. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఆవిషయంలోబాలీవుడ్ నే మించిపోతుందని, సినిమాలు యువత పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఈ పద్దతి మారాలంటూ హెచ్చరించారు. బిగ్ బాస్ వంటి షో ల ద్వారా ఉద్దరించే పనులేం జరుగుతున్నాయని, అలాంటి చెత్త షో లతో సమయం వృద్ధా తప్ప ఒరిగేది ఏమీ లేదని ఆగ్రహం చెందారు.
కుదిరితే నాలుగు మంచి మాటలు చెప్పాలేగానీ, పని పాట లేని పనికమాలిన గేమ్ షోలను టెలికాస్ట్ చేసే ఛానల్స్ ను సైతం బ్యాన్ చేయాలని డిమాండ్ చేసారు. దీంతో బిగ్ బాస్-3కి సెగ గట్టిగానే తగిలేటట్లు కనిపిస్తోంది. ఇలాంటి వివాదాల్లోకి స్టూడెంట్స్ యూనియన్స్ ఎంటర్ అయితే సినిమా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య విద్యార్ధి సంఘాలను అడ్డు పెట్టుకునే శ్రీరెడ్డి ఛాంబర్ వద్ద భైటాయించి పాపులర్ అయింది. మంచి కోసం విద్యార్ధులు పోరాటం చేస్తే…. శ్రీరెడ్డి వాళ్లని తెలివిగా వాడుకుని స్కిప్ కొట్టింది. తర్వాత వాస్తవాలు గ్రహించి శ్రీరెడ్డిపై స్టూడెంట్స్ రివర్స్ అయిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులను బట్టి బిగ్ బాస్-3 టెలికాస్ట్ చేయడం అన్నది అంత ఈజీ కాదని తెలుస్తోంది.