గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు చాలా తక్కువేనని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైయస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. టిడిపి పాలనలో తెచ్చిన అప్పుల కంటే ఇప్పుడు అప్పులు చాలా తక్కువెనని.. కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
గత ఎన్నికలలో 151 సీట్లు వచ్చాయని.. ఈసారి 175 కి 175 సీట్లు ఎందుకు రావు అన్నారు. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేక పోయిందని నిలదీశారు. కావాలనే మన ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని.. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పులివెందులలో వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని.. మిగిలిన బస్టాండ్లకు రోల్ మోడల్ గా పులివెందుల బస్టాండ్ ని తీర్చిదిద్దామన్నారు.