మా తమ్ముడు మా నాన్న కోసం క్రికెట్ ఆడాలి

-

టీం ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ గత వారం తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియాతో ఉన్న సిరాజ్‌ కు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి బిసిసిఐ ఆప్షన్ ఇచ్చింది. కాని అతను ఆస్ట్రేలియాలో ఉండటానికే నిర్ణయం తీసుకున్నాడు. సిరాజ్… బిసిసిఐ పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో, “భారతదేశం కోసం ఆడటం అనేది దేశం గర్వించదగినది” అనే తన తండ్రి కలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు.Mohammed Siraj's father dies, cannot go for final rites due to COVID  restrictions in Australia

అతని అన్నయ్య ఇస్మాయిల్ మాట్లాడుతూ… ఇప్పుడు సిరాజ్ తన తండ్రికి నివాళి అర్పించాలని… అతని కోసం రాబోయే టెస్ట్ సిరీస్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. దేవుడు అతనికి బలాన్ని ఇస్తాడు అని పేర్కొన్నాడు. నేను చెప్పదలచుకున్నది ఇదే… నేను కూడా గుండెలు బాదుకున్నాను, కాని నాతో నా కుటుంబం మరియు బంధువులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. అతను ఒంటరిగా ఉన్నాడని… అతనికి మద్దతు ఇవ్వమని నేను మా ఇంట్లో వారిని కోరుతున్నా అని చెప్పాడు. సిరాజ్ ఈ సిరీస్‌లో బాగా రాణిస్తానని మరియు మా తండ్రికి తగిన నివాళి అర్పిస్తానని వాగ్దానం చేశాడని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news