సింగర్‌ సునీత భర్తపై దారుణమైన ట్రోలింగ్..”ముసలి మొగుడంటూ” !

-

సింగర్‌ సునీత… మ్యాంగో మీడియా అధినేత రామ్‌ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆమె రెండో పెళ్లి చేసుకున్న నుంచి.. సోషల్ మీడియా చాలా యాక్టివ్‌ గా కనిపిస్తున్నారు. ఫోటోస్‌, వీడియోలు షేర్‌ చేస్తూ.. అందరినీ కవ్విస్తూన్నారు సునీత. అయితే.. తాజాగా తన భర్త రామ్‌ వీరపనేనితో కలిసి ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది సునీత.

ఈ ఫోటోను ఉద్దేశిస్తూ.. ఓ నెటిజన్‌ చాలా అసభ్యకరంగా కామెంట్‌ చేశాడు. “ముసలి మొగుడు” అంటూ రామ్‌ పై సెటైర్లు పేల్చాడు ఆ నెటిజన్‌, అయితే.. ఆ కామెంట్లకు సునీత కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. నీది ఓ నోటిదూల.. నీవు భూమికే భారం అంటూ సీరియస్‌ అయింది సునీత. అలాగే.. తన శ్రేయాభిలాషులను ఉద్దేశించి మరో పోస్టు చేసింది సునీత.

”మై డియర్‌ ఫ్రెండ్స్‌ నాపై మీకున్న గౌరవానికి నేనేప్పుడు రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్‌ ద్వారా నా కోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంత మంది ఉన్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే ఉన్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం” అంటూ కామెంట్‌ చేసింది సునీత.

Read more RELATED
Recommended to you

Exit mobile version