100 బాల్స్ టోర్నమెంట్ ఫైనల్ లో జాస్ బట్లర్ టీం చిత్తు … !

-

ఇంగ్లాండ్ వేదికగా 100 బాల్స్ టోర్నమెంట్ కు నిన్న రాత్రితో తెరపడింది. మొత్తం ఎనిమిది జట్లు గత నాలుగు వారాల పాటు వీరోచితంగా పోటీ పడగా చివరికి తుది ఫైట్ కు జాస్ బట్లర్ సారధ్యంలోని మాంచెస్టర్ ఒరిజినల్స్ మరియు సామ్ బిల్లింగ్స్ సారధ్యంలోని ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్లు ఫైనల్ మ్యాట్ లో పోటీ పడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.. అనంతరం మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ టీం నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.. ఆరంభంలోనే ఇబ్బందుల్లో ఉన్న టీం ను నీషం (57) మరియు టామ్ కరన్ (67) లు అర్ద సెంచరీ లతో రాణించి పోరాడగలిగే స్కోర్ ను అందించారు. కానీ ఎంతో బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న మాంచెస్టర్ ఒరిజినల్స్ గెలుస్తుందని అంతా ఊహించారు. కానీ అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి, బట్లర్ టీం కీలక మ్యాచ్ లో తడబడడంతో 14 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యి టైటిల్ ను ఓవల్ కు అప్పగించింది.

ఇక మ్యాచ్ విన్నింగ్ స్కోర్ చేసిన కరన్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, టోర్నమెంట్ మొత్తం బంతి మరియు బ్యాట్ తో రాణించిన ఓవర్ టన్ కు ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news