భార‌త్‌లో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

-

దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌.. 99 దేశాలకు పాకిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇటు మన ఇండియాలోనూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా.. భార‌త్‌ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేలు దాటాయి.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4033 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే… ఒమిక్రాన్ బాధితుల్లో 1552 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కావడం గమనార్హం. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,79,723 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,57,07,727 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,23,619 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 549 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,936 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news