గుడ్ న్యూస్ : ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ అప్పటికి రేడీ.. రేటు ఎంత అంటే ?

-

భారతదేశంలో కోవిడ్ -19 కేసులపై మళ్లీ ఆందోళన పెరుగుతున్న క్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రకటన మన దేశానికి భారీ ఉపశమనంగా చెప్పవచ్చు.

ఆదార్ పూనావాలా ప్రకటన ప్రకారం ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోసం, టీకా ఫిబ్రవరి 2021 నాటికి, మరియు ఏప్రిల్ నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అయితే దేశంలో చిట్టచివరి వ్యక్తి వరకూ కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి సుదీర్ఘ సమయం పట్టవచ్చని అన్నారు. 2024 నాటికి ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడానికి వీలు ఉందని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ధరను 1,000 రూపాయలుగా నిర్ధారించినట్లు పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version