ఆక్సిజన్ సంక్షోభం బాధ్యత కేంద్రానిది కాదు.. రాష్ట్రాలది: బీఎంసీ చీఫ్

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. అయితే ఈ మేరకు ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి బెడ్స్, ఆక్సిజన్, వ్యాక్సిన్ సరఫరా చేయాలని కోరుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు కేసులు తీవ్రత ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నాయని తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయని, పూర్తి వివరాలు సమర్పిస్తేనే కేంద్రం దానికి తగ్గట్లు సాయం చేస్తుందని ముంబై బీఎంసీ చీఫ్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. దేశంలో ఆక్సిజన్ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదని.. అది రాష్ట్రాల బాధ్యతన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంను నిందించడం కరెక్ట్ కాదన్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తమకు ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో అంగీకరించడానికి సిద్ధంగా లేవని, అలాంటప్పుడు కేంద్రం ఎలా బాధ్యత వహిస్తుందన్నారు.

BMC commissioner
BMC commissioner

కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అంతే మొత్తంలో ఆక్సిజన్ కేటాయించిందని చాహల్ తెలిపారు. మహారాష్ట్రకు రోజూకి 6000 ఆక్సిజన్ సిలిండర్లు కేటాయించలేమన్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో 60 వేల కొత్త కేసులను నివేదిస్తోందన్నారు. కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం దానికి అనుగుణంగా ఆక్సిజన్ కేటాయిస్తుందన్నారు. గత నెలలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. కేంద్రం.. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదని చెప్పడంతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆక్సిజన్ సంక్షోభానికి అసలు కారణం.. ముంబై, ఢిల్లీ తదితర పెద్ద నగరాల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచాలని ఆయా రాష్ట్రాలు ఒత్తిడి పెంచాయని చాహల్ అభిప్రాయపడ్డారు. కేసుల తీవ్రత పెరిగినప్పుడు బెడ్ల సామర్థ్యం పెంచామని, బాధితులకు అనుగుణంగా మందులు ఆక్సిజన్ సరఫరా చేస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల లాక్‌డౌన్ విధించే రైట్స్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడం మంచి విషయమన్నారు. ఎందుకంటే.. కేసులు తీవ్రత ఆయా రాష్ట్రాలకు తెలుసని, కేసులు పెరిగితే ఆ రాష్ట్రాలే లాక్‌డౌన్ విధించుకుంటాయని, లేకపోతే ఇలాగే కొనసాగుతుందన్నారు. ముంబైలో 6-7 శాతం పాజిటివిటీ రేటు నమోదయితే అతి జాతీయ లాక్‌డౌన్‌ విధించవచ్చన్నారు.

భవిష్యత్‌లో మూడు, నాల్గవ తరంగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ వల్ల కేంద్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అయినా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎమ్‌సీ చీప్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. జూన్, జూలైలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. 15 రోజుల కిందట సరికొత్త కోవిడ్ కేంద్రాన్ని నిర్మించామన్నారు. ఒక నెల వ్యవధిలో డాష్‌బోర్డు 22 వేల నుంచి 30 వేల పడక గదులు, ఐసీయూ పడకలు 1500 నుంచి 3 వేలు పెంచామన్నారు. జూన్ నాటికి 4 వేలు పెంచుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news