పాడి కౌశిక్ రెడ్డి.. క్రికెటర్ టూ పొలిటీషియన్

 

పాడి కౌశిక్‌రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన పేరు. తొలి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నా ఉప ఎన్నికల ముంగిట గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఇంకా, ఆ ఫైల్ పెండింగ్‌లో ఉన్నది. అది వేరే విషయం అనుకోండి. పాడి కౌశిక్‌రెడ్డికి ఓ క్రికెటర్ అన్న విషయం మీకు తెలుసా. హైదరాబాద్ జట్టు తరఫున ఆడారు. ఆల్ రౌండర్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ లీగ్‌ కూడా ఆడారు. ఆయన గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

– పాడి కౌశిక్ రెడ్డి రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్‌ కూడాను. ఆల్‌రౌండరైన కౌశిక్‌రెడ్డి రంజీల్లో హైదరాబాద్ జట్టు, ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో హైదరాబాద్ హీరోస్, సౌత్‌జోన్ ఆడారు.

– తన మొదటి మ్యాచ్ 2004, డిసెంబర్ 22- 24న హైదరాబాద్‌లో పంజాబ్ జట్టుపై ఆడారు. తన చివరి మ్యాచ్‌ను 2007, జనవరి 10న హైదరాబాద్ వేదికగా పంజాబ్ జట్టుపైనే ఆడారు.

– ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీ లీగ్ అయిన ఇండియన్ క్రికెట్‌ లీగ్‌లో చేరారు. దీంతో బీసీసీఐ పాడి కౌశిక్‌రెడ్డిపై నిషేధం విధించింది.

– ఐసీఎల్‌లో హైదరాబాద్ జట్టు తరఫున 2008 సీజన్‌లో ఆడారు. ఆ తర్వాత నుంచి క్రికెట్ ఆడలేదు.