ప్రెండ్ భార్యతో ఎఫైర్… చివరికి మిగిలింది విషాదమే..

వాళ్లిద్దరు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. పెళ్లయిన తర్వాత కూడా వారి స్నేహాన్ని కొనసాగించారు. తరుచూ ఇంటికి వచ్చే వాడు. దీంతో తన భార్యను కూడా పరిచయం చేశాడు. ముగ్గురి మధ్య స్నేహం బలపడింది. కానీ ప్రెండ్ అని ఇంటికి రానిస్తే అతని భార్యపైనే కన్నేశాడు దుర్మార్గుడు.  చివరికి భార్య కూడా భర్తను కాదని అతడి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఎంత చెప్పినా భార్యా, మిత్రుడు వినకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చివరకు ఇరుగు పోరుగు వారి చీవాట్లతో అవమానం భారం భరించలేక సదరు భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్కు చెందిన గొల్లు బలన్, సాగర్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. గొల్లు బలన్ కు సుధతో వివాహం అయింది.  వీరికి ఒక కుమారుడు. పెళ్లి తరువాత కూడా సాగర్ ఫ్రెండ్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు.. భార్యపైనా సెటైర్లు, జోకులు వేసేవాడు. ఇవేమి భర్త పెద్దగా పట్టించుకొనేవారు కాదు. అదే అతను చేసిన అతిపెద్ద పొరపాటు. అయితే ప్రెండే కదాని సాగర్ ను తరుచూ ఇంటికి రానిస్తే భార్య సుధతో అక్రమసంబంధం ఏర్పరుచుకున్నాడు. విషయం తెలిసి గొల్లు బలన్ భార్యను ఎంతగా బ్రతిమిలాడిన పద్దతి మార్చుకోలేదు. పై నుంచి సాగర్ కు చెబుతా.. అని బెదిరించేది. ఇటు సాగర్ కూడా వినకపోవడంతో గత నెల గొల్లు బలన్ ఉరి వేసుకున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరకు ఇరుగుపొరుగు వారి మాటలతో అవమానంతో సుధ కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల మరణించడంతో ఐదేళ్ల కుమారుడు ఒంటరి అయ్యాడు. గొల్లు బలన్ కు 70 ఏళ్ల తల్లి ఉంది. ప్రస్తుతం మనవడికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంది. అక్రమ సంబంధంతో ఇద్దరు బలి కాగా… మరో ఇద్దరు రోడ్డపై పడ్డారు.