26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న పలువురు పాకిస్తాన్ పౌరులను జాబితాను పాక్ సర్కార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్ మోస్ట్ వాంటెడ్, హై ప్రొఫైల్ టెర్రరిస్టుల లిస్టు ని పాక్ విడుదల చేసింది. ఈ తరుణంలో 26/11 ముంబై ఉగ్రవాద దాడి కేసులో తమకు సహకారం అందించాలి అని భారతదేశం గురువారం పాకిస్తాన్ ను కోరింది. నవంబర్ 26 కి ఈ దాడి జరిగి 12 ఏళ్ళు అవుతుంది.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు భారతీయులే కాదు అని… చాలా మంది విదేశీ పౌరులు అని పాకిస్తాన్‌ను గుర్తు చేస్తూ, పాక్ ని భారత్ ఆ వివరాలు కోరింది. పాకిస్తాన్ 15 దేశాల నుండి వచ్చిన 166 మంది బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో నిజాయితీని నిరూపించలేదు అని ఇండియా ఆరోపించింది. ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఐ), ఫెడరల్ మరియు ప్రావిన్షియల్ ఏజెన్సీల పుస్తకాలలో 1,210 మంది వ్యక్తుల ‘మోస్ట్ వాంటెడ్, హై ప్రొఫైల్ టెర్రరిస్ట్స్ జాబితాలో 2008 ముంబై టెర్రర్ అటాక్ కేసులో పాల్గొన్న 19 మంది ఉగ్రవాదులు ఉన్నారు.