పుష్పవతి అయిందా… అయితే పెళ్లి కరెక్టే : పాకిస్తాన్‌

-

పద్నాలుగేళ్ల పాపను బలవంతంగా పెళ్లి చేసుకుంటే, అప్పుడే ఆ పాప పుష్పవతి అయినందుకుగాను, ఆ పెళ్లి సబబే అని తీర్పు చెప్పింది పాకిస్తాన్‌లోని ఓ న్యాయస్థానం.


పాకిస్తాన్‌లోని ఓ బలహీనవర్గాల కుటుంబం అగ్రవర్ణాల దాష్టీకానికి బలైంది. 14ఏళ్ల క్రిస్టియన్‌ తల్లిదండ్రుల కూతురిని ఓ ముస్లింపెద్ద బలవంతంగా మతం మార్చి, పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ అమ్మాయి తొలిసారి రుతుక్రమానికి రావడంతో, ఆ పెళ్లి షరియా చట్టం ప్రకారం చట్టబద్ధమేనని ఓ కోర్టు తీర్పు చెప్పింది.

హ్యుమా (14) అనే అమ్మాయిని గత అక్టోబరులో అబ్దుల్‌ జబ్బార్‌ అనే వ్యక్తి ఎత్తుకుపోయి, ముస్తింగా మతమార్పిడి చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆ పాప తల్లిదండ్రులు యూనిస్‌, నగీనా తెలిపారు.

అమ్మాయి తరపు లాయరు, యూసుఫ్‌, కింది కోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లున్నట్లు తెలిపారు. హ్యుమా యుక్తవయస్కురాలు కానప్పటికీ, తొలిసారి రజస్వల అయినందున, తనకు జబ్బార్‌కు జరిగిన పెళ్లి షరియా చట్టం ప్రకారం చెల్లుతుందని సింధ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, సింధ్‌ బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం ఈ తీర్పు చెల్లదని తాము వాదించబోతున్నట్లు లాయర్‌ తబస్పుమ్‌ తెలిపారు. సింధ్‌ హైకోర్టు కూడా ఒకసారి అమ్మాయి వయస్సు నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్‌ అధికారి, నిందితుడు జబ్బార్‌కు సహకరిస్తున్నాడని, వయోనిర్ధారణ పరీక్ష ఫలితాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని హ్యుమా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పాఠశాల, చర్చి రికార్డుల ప్రకారం హ్యుమా వయస్పు 14ఏళ్లే. ఈ పరీక్షలు పూర్తయ్యేంతవరకు పాపను జబ్బార్‌ వద్ద కాకుండా బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అలాగే, అంతర్జాతీయ సమాజం కూడా ఈ విషయంలో తమకు సహకరించాలని ఒక క్రిస్టియన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వారు ప్రపంచానికి విజ్ఞప్తి చేసారు.

పాకిస్తాన్‌లో ఈమధ్య ఇటువంటి బలవంతపు మతమార్పిడులు చాలా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హిందూ, క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ముస్లింలు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news