డ్రోన్ దాడిపై కల్నల్ సోఫియా ఖురేషి కీలక ప్రకటన

-

గురువారం రాత్రి పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది. మంత్రిత్వ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ సంయుక్తంగా ఈ దాడుల వెనక ఉన్న అసలు వివరాలను బయటపెట్టారు. వీరిద్దరూ వెల్లడించిన వివరాల ప్రకారం, దాదాపు 300 నుంచి 400 డ్రోన్లు భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చి, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇదే సమయంలో పాక్ యుద్ధ విమానాలు కూడా లోకేషన్ ఆఫ్ కంట్రోల్ (LOC) వెంబడి దాడులకు పాల్పడ్డాయని, భారత ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ తీవ్ర నష్టం చవిచూసిందని తెలిపారు.

విశేషంగా, పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ దాడులు చేయడం పాక్ కుట్రలో భాగమని, ఈ విషయానికి సంబంధించి ఆధారాలు భారత్ ప్రపంచ సమాజం ముందు ఉంచిందని చెప్పారు. అంతేకాకుండా, దాడికి ముందు ఎయిర్‌స్పేస్ మూసివేయకపోవడాన్ని కూడా భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్ మొత్తం 36 ప్రాంతాల్లో దాడి చేయాలని యత్నించినట్లు తెలిపింది. నగరాలు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు – ఇవన్నీ లక్ష్యాలుగా మారాయి. అయినప్పటికీ, భారత్ పరిపక్వతతో స్పందించి, పౌర విమానాలలో ప్రయాణిస్తున్న విదేశీయులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసుకుంది. దాడిలో వాడిన డ్రోన్లు టర్కీకి చెందిన “అసిస్‌గార్డ్ సోంగర్” మోడళ్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news