హైదరాబాధ్ లో జరుగుతున్న పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్ల వార్మ్ అప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఇప్పుడే ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వరల్డ్ కప్ కు ముందు మంచి ప్రాక్టీస్ ను అందుకుంది. పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ ఆజామ్ 80, మహమ్మద్ రిజ్వాన్ 103, సౌద్ షకీల్ 75 లు రాణించారు. ముఖ్యంగా బాబర్ అజామ్ మరియు రిజ్వాన్ లు మంచి ప్రాక్టీస్ చేశారు. బాబర్ ఆజామ్ కూడా సెంచరీ సాధించాల్సింది.. కానీ అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక కివీస్ బౌలర్లలో మిచెల్ ఒక్కడే పాక్ ను కట్టడి చేసి 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
న్యూజిలాండ్ ముందు ఉంచిన 346 పరుగుల లక్ష్యాన్ని లాతమ్ సేన ఛేదించి మెయిన్ మ్యాచ్ లకు ముందుగా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందా చూడాలి.