విషాదం : చిరుతదాడితో బాలుడి మృతి

-

యూపీలో విషాదకర ఘటన జరిగింది. బల్‌రాంపూర్‌ సమీపంలోని పచ్పెర్వా పట్టణంలో చిరుతపులి దాడి చేసింది. ఈ దుర్ఘటనలో 12 ఏళ్ల బాలుడు అమన్ మృతి చెందాడు. ఆ బాలుడు గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. చిరుతపులిని పట్టుకోవాలని అటవీ శాఖను ఆదేశించామని, అమన్ కుటుంబానికి ఆర్థికంగా నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

How to avoid a leopard attack - Discover Wildlife

వివరాల్లోకి వెళితే, అఫ్జల్‌ఘర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం (సెప్టెంబర్28) రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలుడు ఓ షాపు నుంచి ఇంటికి తిరిగి పదేళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసింది. అయితే చెట్టు వెనుక భాగంలో ఉన్న చిరుత దాడి చేసి చంపేసింది.ఆ బాలుడిని చిరుత లాక్కెళ్లడంతో అక్కడున్న గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. ఆ అరుపులు విన్న చిరుత ఆ బాలుడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ బాలుడు చిరుత దాడిలో అప్పటికే మృతి చెందాడు. ధాంపూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, గాయపడిన బాలుడు మరణించాడని పోలీసు అధికారి తెలిపారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు.
కాగా.. చిరుతను వెంటనే పట్టుకోవాలని డిప్యూటీ మేజిస్ట్రేట్ అటవీ అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మోహిత్ కుమార్ , పోలీస్ రేంజ్ ఆఫీసర్ భరత్ సోంకర్ గ్రామస్తులను శాంతింపజేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news