సిరీస్ కోసం కివీస్ దేశం చేరుకున్న పాక్ క్రికెటర్లలో ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్వీట్ చేసింది. ప్రస్తుతం వారంతా క్రైస్ట్‌చర్చ్‌లోని ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఐసోలేషన్‌లో ఉన్న ఆటగాళ్లు కొందరు నిబంధనలు ఉల్లంఘించారట! ఇది న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించిందని సమాచారం. ఎందుకంటే న్యూజిలాండ్ ప్రభుత్వం కరోనాను నియంత్రించడంలో విజయవంతమయ్యిందని ఆ దేశ ప్రధానే స్వయం చెప్పారు. ఇలాంటి సమయంలో కొత్తగా అక్కడ కరోనా వ్యాప్తి చెందడాన్ని ప్రభుత్వం ఎంత మాత్రమూ సహించదు. తమ దేశానికి వచ్చిన పర్యాటకులకు నిబంధనల గురించి వివరంగా చెబుతామని, వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం తమకుందని ప్రభుత్వం అంటోంది. అదే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తల నొప్పిలా మారింది. రూల్స్ అతిక్రమిస్తున్న పాకిస్తాన్ ప్లేయర్లను ఎక్కడ న్యూజిలాండ్ దేశం నుంచి పంపిచేస్తారో అని కంగారుపడుతోంది..
ఇప్పటికే పాక్ ఆటగాళ్లు మూడు సార్లు నిబంధనలను ఉల్లంఘించారని.. వారికి ఇంకొక్క అవకాశం మాత్రమే ఉందని బోర్డు భయపడుతోంది.. ఆ అవకాశాన్ని కూడా జారవిడుచుకుంటే నిర్మోహమాటంగా వెనక్కి పంచడానికి న్యూజిలాండ్ వెనుక అడుగు వేయదని తెలిసిన విషయమే.. ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీంఖాన్ ఆటగాళ్లకు చెప్పారు. చెప్పడమే కాదు హెచ్చరించారు కూడా! ఇది మన దేశ ప్రతిష్టతో ముడిపడిన విషయమని, ఇప్పటికే న్యూజిలాండ్ ప్రభుత్వం ఫైనల్ వార్నింగ్ ఇచ్చిందని, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండని వసీంఖాన్ హెచ్చరించిన్నట్లు సన్నిహత వర్గాలు తెలిపాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని వారు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేమని వసీంఖాన్ తెలిపారు. న్యూజిలాండ్-పాకిస్తాన్ సిరీస్ వచ్చే నెల పది నుంచి మొదలు కానుంది. డిసెంబర్ 18న మొదటి టీ-20 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 26 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది.