బీజేపీలోకి కీలక నేత?

-

దుబ్బాక ఎన్నికల్లో విజయం తెలంగాణ బీజేపీ నేతల్లో ఫుల్ జోష్ నింపింది. రోజురోజుకూ ఆపార్టీ రాష్ట్రంలో బలపడుతున్నది. గ్రేటర్ ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు కైవస చేసుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తహతహలాడుతున్నది. అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతున్నది. ఆపరేషన్ ఆకర్ష్తో ఆయా పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకుంటున్నది. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కమలం పార్టీలో చేరారు. తాజాగా మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ చేరారు. ఇంకా టీఆర్ఎస్ వలసలు కొనసాగే అవకాశం ఉంది.

bjp
bjp

టీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత కాషాయం కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు పొందిన ఆ నేత, తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రస్తుతం హై కమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ తొలి ప్రభుత్వం కేబినెట్లో కొనసాగిన ఆ నేత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశ పడ్డారు. కానీ , నిరాశే ఎదురైంది. అదే మండలి కోటా నుంచి ఉమ్మడి వరంగల్జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్కు అవకాశం కల్పించడంపై తీవ్ర నిరాశతో ఉన్నారు. కాగా, స్థానిక బీజేపీ నేతలు సదరు మాజీ మంత్రితో అర్థరాత్రి వరకు సమావేశమై ఢిల్లీ నేతలతో ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది. తనకంటే తక్కువ ప్రాధాన్యం ఉండే నేతకు మంత్రి పదవి ఇవ్వడం వంటి అంశాలతో మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు.

సదరు నేతతో గతంలోనే పలుమార్లు బీజేపీ నేతలు మంతనాలు జరిపారు. చివరకు గురువారం అర్థరాత్రి వరకు జరిపిన చర్చలతో బీజేపీ నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే ఢిల్లీలోని నడ్డాతో ఫోన్లో మాట్లాడించి మాజీమంత్రికి పలు హామీలుకూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో రెండు రోజుల్లోనే గులాబీని వదిలి కమలం అందుకోనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news