వరల్డ్ కప్ లో అంచనాలకు తగినట్లే రాణించని జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆడిన అయిదు మ్యాచ్ లలో ఏకంగా మూడింటిలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను చాలా డిఫికల్ట్ చేసుకుంది. మరీ దారుణం ఏమిటంటే.. ఆఫ్గనిస్తాన్ ఓడిపోవడమే అంటూ సీనియర్లు సైతం పాకిస్తాన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక మాముండేది కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే అయినా అన్నిటిలో గెలిచి సెమీస్ కు వెళుతామని ధీమాను వ్యక్తం చేశాడు షాదాబ్ ఖాన్. ఇదే విధంగా గతంలోనూ చాలా సందర్భాలలో పుంజుకుని నిలబడ్డాము అంటూ చరిత్రను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు షాదాబ్ ఖాన్.
కాగా ఇక పాకిస్తాన్ తన తర్వాత మ్యాచ్ లలో రేపు సౌత్ ఆఫ్రికా తో ఆడనుండగా, ఆ తరువాత మ్యాచ్ లలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ లతో ఆడనుంది. మరి చూద్దాం ఏమి జరగనుంది.