మెగాస్టార్ చిరంజీవి నటించిన కామెడీ అండ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ చిత్రంగా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2004లో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయే సినిమా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’. 2004లో చిరంజీవి, దర్శకుడు జయంత్ సి పరాన్జీ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపింది. సోనాలీ బెంద్రే, శ్రీకాంత్, పరేష్ రావల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రం నవంబరు 4న రీ రిలీజ్ అవుతోంది.
తాజాగా, ఈ చిత్రం నుంచి ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 2.08 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో దాదాపు సినిమాను చూపించేశారు. ఓ పాటలో పవన్ కల్యాణ్ కూడా తళుక్కుమనడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఒకటిగా ఎదురు చూస్తున్న రీ రిలీజ్‌ల్లో ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ మూవీ ‘మున్నా భాయ్ ఎంబిబిఎస్’కి ఇది రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని జయంత్ పరాంజీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో చిరంజీవి ఇంగ్లీష్ పదాలతో తెలుగు సమేతులు చెబుతుంటే థియేటర్స్ లో ఆడియన్స్ అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు.