ఈ రోజు జరిగిన మూడు ప్రాక్టీస్ మ్యాచ్ లలో ఆస్ట్రేలియా పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ శ్రీలంక మరియు నెథర్లాండ్ ఇండియాలు తలపడాల్సి ఉండగా ఇండియా మ్యాచ్ రద్దు అయింది. మిగిలిన రెండు మ్యాచ్ లు మాత్రమే కొనసాగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైద్రాబాద్ వేదికగా ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (48) మరియు మార్ష్ (31) లు నిలకడగా పరుగులు చేయడంతో మొదటి వికెట్ కు 83 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. అనంతరం స్మిత్ మరియు లాబుచెన్ లు కాసేపు పాకిస్తాన్ బౌలర్లను ప్రతిఘటించినా ఆ తర్వాత అవుట్ అయ్యారు. చివర్ల్ప్ మాక్స్ వెల్ 77 పరుగులు మరియు గ్రీన్ 50 మరియు ఇంగ్లిష్ 48 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.
ఇక పాకిస్తాన్ బౌలర్లలో సామా మీర్ ఒక్కడే రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరి ఆస్ట్రేలియా నిర్దేశించిన 352 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.